బంగారం ధర ఎప్పుడు ఎంత తగ్గుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. నిన్నటి వరుకు కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు భారీగా తగ్గుతూ వస్తుంది. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలిపోవడం.. ఇన్వెస్టర్లు అంత బంగారం ధరపై ఇన్వెస్ట్ చెయ్యడం.. బంగారం ధర కాస్త కొండ ఎక్కడం అన్ని వరుసగా జరుగుతున్నాయి. 

 

అయితే బంగారం ధర అంత పెరిగినప్పటికీ అప్పుడప్పుడ్డు కాస్త తగ్గుతూ వస్తుంది లెండి. అలానే బంగారం ధర భారీగా తగ్గింది.. అయితే ఇప్పుడు భారీగా తగ్గినప్పటికీ మళ్లీ రెండు రోజులకే బంగారం ధర అంతకుమించి పెరుగుతుంది. ఏదో తగ్గినా రోజు కాస్త తగ్గింది అని సంబరపడాలి అంతే. మరి ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయిల తగ్గుదలతో 48,870 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 210 రూపాయిల తగ్గుదలతో 45,090 రూపాయలకు చేరింది.  

 

ఇంకా వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 300 రూపాయిల తగ్గుదలతో 49,900 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు తగ్గుతాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: