బంగారం ధర కానివినియెరగని రీతిలో అత్యంత భారీగా పతనం అవుతుంది. గత రెండు రోజుల నుండి బంగారం ధర తగ్గుతూ వస్తుంది. నిన్నటికి నిన్ననే భారీగా తగ్గిన బంగారం ధర ఇప్పుడు మరింత తగ్గింది. అయితే కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధర నిన్నటి నుండి తగ్గుముఖం పట్టింది. 

 

కరోనా వైరస్ కారణంగా బంగారం ధర ఆకాశాన్ని తాకింది. కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా కుప్పకూలడం ఇంకా ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర భారీగా పెరిగింది. ఇలా బంగారం ధర భారీగా పెరిగితే కరోనా వైరస్ ప్రారంభ సమయంలోనే వెండి ధర ఏకంగా 10 వేలు పడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలుఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయిల తగ్గుదలతో 49,780 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 390 రూపాయిల తగ్గుదలతో 44,680 రూపాయలకు చేరింది.  

 

ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 1,260 రూపాయిల తగ్గుదలతో 48,900 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: