బంగారం.. ఎప్పుడు ఎందుకు తగ్గుతుందో ఎవరికి తెలియదు. నిన్న భారీగా పెరిగింటే ఈరోజు స్వల్పంగా తగ్గుతుంది. మరుసటి రోజు తగ్గిన బంగారం ధర కూడా భారీగా పెరుగుతుంది. ఇలా తగ్గుతూ పెరుగుతూ వెళ్తున్న బంగారం ధర గత సంవత్సరం నుండి భారీగా పెరుగుతు వస్తుంది. గత సంవత్సరంకు ఈ సంవత్సరంకు ఏకంగా 16 వేల రూపాయిలు పెరిగింది. 

 

ఇంకా కరోనా వైరస్ వల్ల కేవలం మూడు నెలలలోనే ఆరు వేలు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత ఇంకేదీ లేదు అన్నట్టు బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా ఈరోజు కూడా బంగారం ధర భారీగానే తగ్గింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.  

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలుఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిల తగ్గుదలతో 48,640 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిల తగ్గుదలతో 44,560 రూపాయలకు చేరింది.

 

ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 400 రూపాయిల తగ్గుదలతో 48,500 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: