బంగారం ధర గత నాలుగు రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తుంది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పటికే బంగారం ధర భారీగా తగ్గింది. అయితే ఇప్పుడు బంగారం ధర ఎంత తగ్గిన.. ఈ తగ్గినా రెట్టింపు పెరుగుతుంది. ఇంకా అలానే ఏడాదిలో 16 వేల రూపాయిలు పెరిగింది. 

 

గత సంవత్సరం ఈ సమయానికి బంగారం ధర 31 వెయ్యి ఉండేది. ఇప్పుడు ఏకంగా 46 వేలు అయ్యింది. ఇలా పెరగడానికి కరోనా వైరస్ కూడా ఒకరమైన కారణం అయ్యింది. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలడం. ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర ఆకాశాన్ని తాకింది. ఇంకా ఇప్పుడు కూడా బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల తగ్గుదలతో 48,520 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల తగ్గుదలతో 44,430 రూపాయలకు చేరింది.

 

ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 500 రూపాయిల తగ్గుదలతో 48,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి: