ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధర గత ఐదు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తుంది. బంగారం తగ్గడం ఇది ఐదొవ రోజు కావడం గమనార్హం. బంగారం కొనాలి అని అనుకునే వారికీ ఇది శుభవార్త అనే చెప్పాలి. అయితే బంగారం ధర ఇలా భారీగా క్షిణించడానికి కారణం ఆంతర్జాతీయ మార్కెట్ ఏ  అని.. అక్కడ బంగారం ధర భారీ తగ్గుదల నేపథ్యంలో మన దేశ మార్కెట్ లోను బంగారం ధర భారీగా తగ్గింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

కాగా బంగారం ధర కేవలం మూడు నెలలలో ఆరు వేలు పెరిగింది. దీనికి కారణం కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు. ఇంకేముంది బంగారం ధర ఆకాశాన్ని తాకింది. అయితే అలాంటి బంగారం గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు కూడా బంగారం ధర భారీగా తాగుతూ వస్తుంది. నేడు బంగారం వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 480 రూపాయిల తగ్గుదలతో 48,350 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 480 రూపాయిల తగ్గుదలతో 44,270 రూపాయలకు చేరింది.

 

ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 1,080 రూపాయిల తగ్గుదలతో 47,400 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు వద్ద బంగారం ధరలు తగ్గుతూ కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే తగ్గుతూ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: