బంగారం ధర.. రెండు రోజుల క్రితం వరకు భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు భారీగా పెరుగుతూ వస్తుంది. నాలుగు రోజులలో వెయ్యి రూపాయిలు బంగారం ధర తగ్గితే కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ వెయ్యి రూపాయిలు పెరుగుతుంది. ఇంకా ఇలా బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇలా పెరగడానికి అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా తగ్గింది అని అందుకే బంగారం ధరలు పెరిగాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

ఇంకా నిజానికి ఈ కరోనా వైరస్ రావడం వల్ల బంగారం ధర మూడు నెలల్లో ఏకంగా ఆరు వేలరూపాయిలు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారం పైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే బంగారం ధరలు భారీగా పెరిగాయ్. ఇంకా నేడు బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల పెరుగుదలతో 48,510 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయిల పెరుగుదలతో 44,470 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 60 రూపాయిల పెరుగుదలతో 47,500 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతుంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: