బంగారం ధర గత నాలుగు రోజుల నుండి వరుసగా పెరుగుతూనే ఉంది. బంగారం ధర ఇలా పెరుగుతూనే ఉంటే ఇంకా ఇప్పట్లో సామాన్యులు అసలు కొనలేరు. నాలుగు రోజుల క్రితం వరకు బంగారం ధర భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు తగ్గినా దానికి రెట్టింపు పెరుగుతుంది. అయితే బంగారం పెరగడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా ఉంది అని అందుకే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది అని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. 

 

ఇంకా అంతర్జాతీయ మార్కెట్ ఒక ఎత్తు అయితే స్టాక్ మార్కెట్ మరో ఎత్తు.. ఈ కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ అతి దారుణంగా కుప్పకూలిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల బంగారం ధర భారీగా పెరిగింది అని మార్కెట్ నిపుణలు చెప్తున్నారు. మరి నేడు బంగారం ధర ఎంత పెరిగింది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధర ఇలా కొనసాగుతుంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిల పెరుగుదలతో 45,370 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 520 రూపాయిల పెరుగుదలతో 49,500 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిలు పెరుగుదలతో 48,500 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ మార్కెట్ లోను బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగడంతోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.                     

మరింత సమాచారం తెలుసుకోండి: