పసిడి ప్రేమికులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ‌వార్త‌ అని చెప్పొచ్చు. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌.. ఈ రోజు కొన్ని చోట్లు స్వ‌ల్పంగా దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర దిగొచ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 46,050 రూపాయల వద్ద నిలిచింది. ఇక అదే స‌మ‌యంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల త‌గ్గ‌డంతో 47,250 రూపాయలుగా నమోదు అయింది.

 

ఇక ఇక్క‌డ బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధరలు ఇక్కడ కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48,450 రూపాయలుగా నమోదు అయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.45,370 వద్దనే ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే నిలిచింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,500 వద్ద కొనసాగుతోంది.

 

అయితే వెండి ధరలు మాత్రం హైద‌రాబాద్ మార్కెట్‌లో స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర శుక్రవారం రూ.48,450కు క్షీణించింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధ‌ర‌ 45,370 రూపాయల వద్ద నిలిచింది. మ‌రోవైపు 24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా నిలిచింది. దీంతో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌ 49,500 రూపాయల వద్ద నిలిచింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: