వామ్మో.. ఎన్ని రోజులకు తగ్గింది ఈ బంగారం ధర! అని మీకు అనిపిస్తుంది కదా! నిజమే.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంత భారీగా తగ్గాయి అంటే? ఏకంగా 600 రూపాయిలు తగ్గింది. అయితే ఈ లాక్ డౌన్ లో పెరిగిన బంగారం లో ఎక్కువ ఏం కాదు లెండి. కేవలం 10 శాతం తగ్గింది అంతే. అవును.. మీరు వినింది నిజం. 

 

IHG

 

బంగారం ధర ఈ కరోనా లాక్ డౌన్ లో కనివిని ఎరగని రీతిలో బంగారం ధర పెరిగింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిపోయింది. లాక్ డౌన్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు. ఇంకేముంది బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. 

 

IHG

 

ఇంకా అలాంటి బంగారం ధరలు నేడు ఎంత ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధర ఇలా కొనసాగుతుంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిల తగ్గుదలతో 45,370 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 520 రూపాయిల తగ్గుదలతలో 49,500 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 

 

IHG

 

దీంతో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిలు తగ్గుదలతో 48,100 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ మార్కెట్ లోను బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గడంతోనే బంగారం ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: