బంగారం వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఇంకా అలాంటి ఈ బంగారం ధరలు కరోనా వైరస్ కారణంగా మరింత పెరిగాయి. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర ఆకాశాన్ని తాకుతూంతుంది. 

 

ఇప్పుడు తులం బంగారం ధర 50 వేలు పలుకుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధర భవిష్యేత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా గత సంవత్సరంతో పోలిస్తే బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా 20 వేలు పెరిగింది. గత సంవత్సరం తులం బంగారం 31 వెయ్యి ఉండేది.. ఇప్పుడు 50 వేలకు పైగా ఉంది. 

 

మరి అలాంటి బంగారం ధరలు ఎంత పెరిగాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 50,280 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 46,090 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 48,670 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.                             

మరింత సమాచారం తెలుసుకోండి: