బంగారం.. ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి తెలియదు. ఒకరోజు ధరలు భారీగా పెరిగితే మరో రోజు స్వల్పంగా తగ్గుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ వెళ్తున్న బంగారం ధర గత సంవత్సరం నుండి భారీగా పెరుగుతు వస్తుంది. కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 19 వేల రూపాయిలు పెరిగింది. 

 

ఇంకా కరోనా వైరస్ వల్ల మరింత దారుణంగా బంగారం ధరలు పెరిగాయ్. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. మరి ఈ బంగారం, వెండి ధరలు ఈరోజు ఎంత తగ్గాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయిల తగ్గుదలతో 50,390 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయిల తగ్గుదలతో 46,100 రూపాయలకు చేరింది.

 

ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 400 రూపాయిల తగ్గుదలతో 48,500 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల వద్ద కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: