బంగారం ధర తగ్గిందంట అని ఒక్కసారి అలా ఆనందపడేలోపే బంగారం ధర భారీగా పెరిగింది అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. గత సంవత్సరం నుండి బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 20 వేలు పెరగడం మాములు విషయం కాదు.. 

 

ఇంకా అలా పెరుగుతుంది.. అంతర్జాతీయ మార్కెట్ లోను బంగారం డిమాండ్ పెరగడం భారతీయులకు ఒక శాపంగా మారిపోయింది. ఇంకా కరోనా వైరస్ కారణంగానూ బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం.. ఇన్వెస్టర్లు అంత బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడం.. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం ధర పెరిగిపోయింది. 

 

మరి అలాంటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిల పెరుగుదలతో 50,560 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయిల పెరుగుదలతో 46,350 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల పెరుగుదలతో 48,450 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: