బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రోజుల క్రితం తగ్గిన బంగారం ధర ఇప్పుడు రెట్టింపు పెరిగింది. ఒక్క సంవత్సరంలో ఏకంగా 19 వేలు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటం వల్లే బంగారం ధర భారీగా పెరిగిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయి అనేది చూద్దాం.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల పెరుగుదలతో 50,660 రూపాయలకు చేరింది. ఇక అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల పెరుగుదలతో 46,440 రూపాయలకు చేరింది.    

 

IHG

 

ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల తగ్గుదలతో 48,500 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

అయితే ఇలా బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇంకా ఒకవైపు కరోనా వైరస్ కూడా కారణమే అవుతుంది. కరోనా కారణంగా ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: