బంగారం ధరలు రెండో రోజు కూడా భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఈ బంగారం ధర ఇప్పుడు స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అయితే బంగారం ధరలు ఎంత తగ్గిన ప్రస్తుతం సామాన్యులు కొనలేరు. ఎందుకంటే తులం బంగారం ధర ఇప్పుడు ఏకంగా 50 వేల రూపాయలకు పైన ఉంది. 

 

ఇంకా నేడు బంగారం, వెండి ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి. ఎంత తగ్గాయి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల తగ్గుదలతో  50,880 రూపాయలకు చేరింది. ఇంకా అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల తగ్గుదలతో 46,270 రూపాయలకు చేరింది. 

 

IHG

 

ఇలా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల తగ్గుదలతో 48,550 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

అయితే ఇలా బంగారం ధరలు భారీగా తగ్గటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా కేవలం సంవత్సరంలోనే తులం బంగారం ధరపై ఏకంగా 19 వేలు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు సామాన్యులకు అందేరేంజ్ కు ఎప్పుడు చేరుతాయి అనేది చూడాలి.         

మరింత సమాచారం తెలుసుకోండి: