బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్నటికి నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గాయి. అయితే ఒక్క సంవత్సరంలోనే ఏకంగా తులం బంగారంపై 19 వేలు పెరిగిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా 50 వేల రూపాయలకు చేరింది. ఇంకా అలాంటి ఈ బంగారం ధర రోజుకు 100 రూపాయిలు.. 200 రూపాయిలు తగ్గుతూ వస్తుంది. మరి ఈరోజు బంగారం ధరలు ఎంత తగ్గాయి అనేది చూద్దాం. 

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల తగ్గుదలతో 50,620 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 80 రూపాయిల తగ్గుదలతో 46,020 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 400 రూపాయిల తగ్గుదలతో 49,200 రూపాయలకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల వద్ద కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.        

                      

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. బంగారం ధరలు మరింత తగ్గితే సామాన్యులు కొనగలుగుతారు..                

మరింత సమాచారం తెలుసుకోండి: