మహిళలకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయ్. సాధారణంగా బంగారం ధరలు ఈ మధ్యకాలం భారీగా పెరిగాయ్. కానీ ఇప్పుడు గత నాలుగు రోజులుగా కిందికి దిగుతూ వస్తున్నాయ్. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ సామాన్యులు కొనేంత స్థితిలో లేరు. ఎందుకంటే బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి కాబట్టి. 

 

అయితే  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరపెరిగినప్పటికీ జువెలర్లు, రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని అందుకే బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇంకా నేడు బుధువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.70 తగ్గుదలతో రూ.51,170కు క్షీణించింది. 

 

IHG

 

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.70 తగ్గుదలతో రూ.46,910కు క్షీణించింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర 90 రూపాయిల తగ్గుదలతో రూ.51,920 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణం అని వ్యాపార నిపుణులు అంటున్నారు.    

 

కాగా దేశ రాజధాని ఢిల్లీలోను నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేలకు చేరగా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: