మనం తినే పండ్లలో ఎన్నో రకాల విటమిన్లు, పోషక పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా  నారింజ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందింపేయటంతో పాటు త్వరగా వృద్ధాప్యం బారినపడకుండానూ కాపాడుతుంది. నిరసంగా ఉన్నవారికి నారింజ జూస్ ఎంతో మేలు చేస్తుంది.

నారింజలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ‌- ఏ, బి స్వల్పంగా, విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. ఈ పండు రోజుకు మనకు కావలసిన 'సి' విటమిన్‌ ఈ పండు నుండి లభిస్తుంది. జ్యూస్‌గానో, అలాగే తోలువొలిచి తీసుకోవడమూ మంచిది.

కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది.  

నారింజలో మాంసకృత్తులు  - 0.9%, పిండి పదార్ధాలు  - 10.6%, క్రొవ్వు - 0.3%, ఇనుము - 01% శాతం ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిలోని ఫోలియాసిడ్‌, ఫోలేట్‌ మెదడు అభివృద్ధి చెందటానికి, చురుకుగా ఉండటానికి తోడ్ఫడతాయి. అందువల్ల ఇది గర్భిణులకూ ఎంతో మేలు చేస్తుంది. పుట్టబోయే పిల్లల్లో వెన్నుపాము లోపాలు తలెత్తకుండా చూస్తుంది.

నారింజలోని హెన్‌పెరిడిస్‌ వంటి ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలు పూడుకుపోకుండా కాపాడతాయి. ఫలితంగా గుండెపోటు, ఇతర గుండెజబ్బుల ముప్ఫూ తగ్గుతుందన్నమాట.ఇందులోని పీచు జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇలా అల్సర్లు, మలబద్ధకం వంటి సమస్యలనూ నివారిస్తుంది.  

నారింజలోని విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంటు్ల వీర్యం నాణ్యతను, వీర్యకణల కదలికలను మెరుగు పరచి.. సంతాన అవకాశాలను పెంపొందిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: