వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి.వాము శరీరంలో వాతాన్ని హరింపచేస్తుంది. శూలలను తగ్గిస్తుంది.జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి.   పసిపిల్లలకు పొట్ట ఉబ్బరంగా ఉందంటే చాలు వాము నీటిని పట్టమంటారు డాక్టర్లు. అందుకే... ఇతర నిత్యావసరాలతో పాటు... వాము మన వంటింట్లో తప్పనిసరిగా ఉండి తీరాలి. వాము ఆకలిని పెంచుతుంది.


పొట్టలోని ఇన్ఫెక్షన్ కు ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి కొద్దిగా వామును నేరుగానైనా లేదా పొడిచేసుకుని పొడిచేసుకుని అన్నంతోపాటు తిన్నా సరే.. గ్యాస్ సంబంధ సమస్యలను దూరం చేయవచ్చు, అజీర్తి దరిచేరదు. వామును మజ్జిగతోనూ కలిపి తీసుకోవచ్చు. డాక్టర్లు చెప్పిన ప్రకారం వాము, బెల్లం కలిపి తీసుకుంటే శ్వాససంబంధ సమస్యలు ఉండవు. తరచూ కాళ్ళు, చేతుల నొప్పులు వేదిస్తుంటే వాము నూనెను మర్ధనా చేసుకుని చూడండి. ఉపశమనం లభిస్తుంది.  


*వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.


* వాము, ధనియాలు, జీలకర్ర  ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.


* వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.

* వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.

* వాత వ్యాధులు తగ్గించే శక్తి వాముకి ఉంది. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.

* మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.

* ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

* వాము నూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు ఇది ఎంతో మంచిది. 

* పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి. దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: