తెల్లజుట్టు సమస్యతో యంగ్ స్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాతికేళ్లు కూడా రాకుండానే.. జుట్టు నెరిసిపోతుండటంతో.. చాలా అప్ సెట్ అవుతున్నారు. ఒత్తిడి, పొల్యూషన్, తీసుకునే ఆహారం చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.వెంటనే ఈ హోం రెమిడీస్ చూసేసి ట్రై చేయండి.

కొబ్బరినూనె:

కొబ్బరి నూనెలో కొ్దిగా నిమ్మరం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగానూ.. తెల్లజుట్టు నల్లగానూ మారుతుంది.

మెంతులు:

మెంతులు జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేస్తూ ఉండాలి. లేదా నానబెట్టిన మెంతులకు పెరుగు కలిపి జుట్టుకి పట్టించుకుంటే.. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.

గోరింటాకు:

గోరింటాకు జుట్టుకు సహజ సౌందర్యాన్నిస్తుంది. గోరింటాకును మెత్తగా పేస్ట్ చేసి.. తలకు పట్టించాలి. దీనివల్ల తెల్లజుట్టు నల్లగా మారడమే కాదు.. డ్యామేజ్ అయిన జుట్టు కూడా మెరుస్తుంది.

ఉసిరికాయ:

ఉసిరికాయ మీ జుట్టుకు నాచురల్ కలర్ ని ఇస్తుంది. ఉసిరికాయను ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత మెత్తగా రుబ్బి కొబ్బరి నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి తలకు పట్టిస్తూ ఉండాలి. కొన్ని రోజుల్లోనే నల్లని కురులు మీ సొంతమవుతాయి.

గోధుమ పిండి:

గోధుమ పిండి జుట్టును నల్లగా చేయడానికి సహాయపడుతుంది. గోధుమపిండిలో కాస్త అల్లం, ఒక స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా చేస్తే మీకే తేడా తెలుస్తుంది.
కరివేపాకు:

వంటల్లో రుచికే కాదు.. సౌందర్యానికి ఉపయోగపడుతుంది కరివేపాకు. కరివేపాకులో కొద్దిగా మజ్జిగ కలపి పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ ని స్నానం చేసే నీటిలో మిక్స్ చేసుకోవాలి. వాటితో స్నానం చేస్తే.. సరిపోతుంది. వారానికి రెండు మూడు సార్లు ఈ నీటితో తలస్నానం చేస్తే.. జుట్టు నల్లగా మారుతుంది.

నువ్వుల నూనె:

క్యారెట్ ను పేస్ట్ చేసి వడకట్టిన ఆయిల్ ని నువ్వుల నూనెలో మిక్స్  చేయాలి. ఆ కాంబినేషన్ నూనెను తలకు పట్టించి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: