పండ్ల రసాలను తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలు చేకురుతాయని వైద్యులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని పండ్లు చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతున్నాయని బ్యూటిషన్లు చెబుతున్నారు. ఇందులో ఆరంజ్ జ్యూస్‌ చర్మ సౌందర్యాన్ని రెండింతలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు.  రోజూ ఆరేంజ్ జ్యూస్ తాగండి అంటన్నారు. ఆరోగ్య బ్యూటీషన్ నిపుణులు. రోజు ఓ గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం మరింత మెరుగవడం తో పాటు కేశాలు, గోళ్ళు కాంతివంతంగా తయారవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.  

 

ఆరెంజ్ లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫొలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మం సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది.  అంతేకాకుండా ఆరంజ్ జ్యూస్‌ను ఫ్రీజర్లో ఉంచి గట్టిగా తయారయ్యాక ఓ తెల్లని వస్త్రంలో కట్టి కంటి రెప్పలపై ఐదు నిమిషాల పాటు ఉంచితే కంటికి కొత్త అందం చేకూరుతుంది. ఇలా రోజు మార్చి రోజు చేస్తే మీ కళ్ళు ఇతరుల్ని ఆకట్టుకునే విధంగా తయారవుతాయని బ్యూటిషన్లులు అంటున్నారు.


స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్  రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ 200 ఎం ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60 ఎంజీ విటిమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. కాగా 200 మంది కాస్మటిక్ ఎగ్జిక్యూటీవ్ ఉమెన్ పై ఈ పరిశోధన జరిగిందని యూకే కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ వెల్లడించిం

మరింత సమాచారం తెలుసుకోండి: