పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడుతుందని ఒక ఇన్స్టిట్యూట్ న్యూట్రీషన్స్ వారు పండ్ల మీద చేసిన రీసెర్చ్ లో తెలిసింది. జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయంటున్నారు వారు. ఇక జామకాయలోని ఆ పవర్ఫుల్ ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం... మధుమేహగ్రస్తులకు: చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో ఉంచబడింది. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి. బరువు తగ్గడానికి: అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునేవారికి జామ ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ఎందుకంటే, జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. పోషకాలు ఎలాగూ ఉన్నాయి కనుక నీరసం రాదు. అందుకే ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం చేసే " పెక్టిన్" జామలొ లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. క్యాన్సర్ నివారిణి: శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. దంత క్షేమం : జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది. ఎసిడిటి: ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు: కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి. కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం: ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి. కంటి క్షేమానికి : జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. సంతానోత్పత్తికి: జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్: జామకాయలో ఐయోడిన్ లేదు. అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెన్సురేషన్ : రుతుస్రావ సమస్యలను దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో, స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో, జలుబుకు విరుగుడుగా జామ సమర్థవంతంగాపనిచేస్తుంది. చర్మ సంరక్షణ: చర్మ సంరక్షణకు సైతం జామ తనవంతు కృషి చేసుందని వైద్య నిపుణుల చెబుతుంటారు. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుందని బ్యూటీషియన్లు చెబుతుంటారు. ముసలితనాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. కాలిన గాయాలకు: కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. మెదడుకు: ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. మలబద్దకం: బాగా మిగలపండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం చిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: