చూస్తే మూతబడ్డ వాటిల్లా కనపడతాయి. కాని కోట్ల రూపాయల సంపాదన అందిస్తాయి. చెప్పేది ఒకటి.. బట్ అందులో జరిగేది మరొకటి. అందుకే డ్రగ్స్ మాఫియాకు అవి కేరాఫ్ అడ్రస్సుగా మారాయి. ఒకప్పుడు దిగుమతి చేసుకునే మనం.. ఇప్పుడు దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్టేజికి చేరామంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో తెలుస్తోంది. భాగ్యనగరంలోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నిఘాలేమిని ఆసరాగా చేసుకుని కక్కుర్తితో... చేయకూడని పని చేస్తున్నారు.