ప్రకృతి అందించే సహజ సౌందర్యం, కోమలమైన శరీరం కావాలి అనుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉంటారు. అలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా టీచర్స్. యోగా చేయడంవలన అమ్మాయిలు సెక్సీగా కూడా ఉంటారంటున్నారు యోగా నిపుణులు. దీంతో ముఖం, శరీరంలో కాంతి వస్తుంది.  
  • ముఖంలో కాంతి :
  •   శరీర రంగు ఏదైనా ఉండొచ్చు. కాని ముఖంలో కళ ఉట్టిపడాలంటే మీరు తప్పనిసరిగా యోగా చేయాలి. దీంతో ప్రతి ఒక్కర దృష్టి మీపైనే ఉంటుంది. ముఖంలో ఉట్టిపడే కళకు మనయొక్క కడుపుకు సంబంధం ఉంది. ఇవి రెండు శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుగు ఉపాయాలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలంటున్నారు యోగా నిపుణులు.  
  • > కంఠాన్ని శుభ్రం :
  •  కంఠాన్ని శుభ్రం చేసుకోవాలి. నోటికి సంబంధించిన వ్యాయామము, బ్రహ్మముద్ర.
  • సౌందర్యం :
  •  
  • శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగాకూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడివుంటుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉంటే అది వెన్నెముకకు, శరీర కండరాలకు హాని చేస్తుంది. అలాగే శరీరంలో అసలు కొవ్వే లేకుంటే కూడా చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికికూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా నిపుణులు.
  •    
  • సూక్ష్మమైన వ్యాయామం చేయండి. :
  •  
  • ఆరు ఆసనాలు తప్పనిసరిగా చేయాలి. త్రికోణాసనం, తాడాసనం,  పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం. ప్రాణాయామం. మాలిష్..
  •    
  • ఇవి తప్పనిసరిగా చేస్తే శరీర రంగు ఏదైనా ఉండొచ్చు అమ్మాయిల శరీరం కోమలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖం కళ కళలాడుతుంది. అలాగే ఆహారంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు యోగా గురువులు.
  •  

    మరింత సమాచారం తెలుసుకోండి: