జుట్టు అందం ముడిచినప్పుడు, వాటి ఆరోగ్యం దువ్వినప్పుడ తెలుస్తుందంటారు. సమయానుకూలంగా నీళ్ళు పోసి, ఎరువు వేస్తే మొక్క ఎలా ఏపుగా పెరుగుతుందో, కనీస జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అంత అందంగా, ఆరోగ్యంగా తయారువుతోంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగడం కోసం ఎన్నో రకాలు చిట్కాలు చదివాం, పాటించాం కూడా, అయితే క్యారెట్ కూడా జుట్టుకు సంరంక్షణ ఇస్తుందని తెలియదు, క్యారెట్ ఏకాలంలోనైనా జుట్టు సంరంక్షణకు చాలా దోహదపడుతుంది. వేసవిలో జుట్టు ఎండిపోయి చివరలు చీలుతుంటాయి.  క్యారెట్ ఆకులు అటువంటి జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఆరు క్యారెట్ ఆకులకు ఒక టీ స్పూన్ నువ్వుల నూనె చేర్చి మిక్సీలో ముద్ద చేయాలి. ఈ నూనెను తలకు రాసుకుని పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపుగా పెరుగుతుంది. పెసర పిండిలో క్యారెట్ ఆకులు, నువులనూనె కలిపి ముద్ద చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే జుట్టు చివరలు చీలికలను ఆపీ జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది ఈ పేస్టు. పైన చెప్పిన వాటితో తైలం కూడా చేసుకోవచ్చు, అరకిలో నువ్వుల నూనెను సన్నని మంటమీద కాచాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ మిరియాలు, క్యారెట్ ఆకుల ముక్కలు వేసి సువాసన వస్తున్నప్పుడు దించేయాలి.  చల్లారాక వడపోసి సీసాలో పోసి పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను తలకు రాసుకుని శీకాయ లేదా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా దట్టమైన మేఘంలాగా పెరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: