బాదంపప్పు బాదం చెట్లకి కాసే కాయల విత్తనాలని? బాదంపప్పు తియ్యగా, చేదుగా కలిపి ఉంటాయి. తీయని బాదంలు తింటారు మరియు చేదువాటిని నూనె తీయడానికి వాడతారు.బాదంలలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి, ముఖ్య పోషకపదార్థాలైన ప్రొటీన్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి.రక్తపోటున్నవారికి బాదంపప్పు చాలా ఉపయోగకరం ఎందుకంటే ఇవి నాడీ మరియు కండరాలు మెరుగ్గా పనిచేయటానికి సాయపడతాయి.

Image result for badam pappu

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందినానబెట్టిన బాదంపప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. బాదంపప్పులను నీటిలో నానబెట్టినపుడు, పైన తొక్కు తీసేయడం వలన సులువుగా జీర్ణమై, ఎక్కువ పోషకాలు దాని నుంచి అందుతాయి.కడుపుతో ఉన్నప్పుడు మంచిదిమీరు కడుపుతో ఉన్నవారైతే, మీ డైట్ లో తప్పక బాదంలను జతచేసుకోండి, ఎందుకంటే ఇవి మీ బేబీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నానబెట్టిన బాదంపప్పులు తల్లికి, బిడ్డకి అన్నిటికన్నా ఎక్కువ పోషణ, శక్తిని అందిస్తాయి.

Image result for badam pappu

అంతేకాక బాదంపప్పులలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి.మెదడు పనితీరును మెరుగుపరుస్తుందిడాక్టర్లు 4 నుంచి 6 బాదంపప్పులు రోజూ తినటం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి, కేంద్రనాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకని, పొద్దున్నే బాదం తినటం వలన మీ జ్ఞాపకశక్తి చురుకుగా మారి, మెదడు పనితీరు మెరుగవుతుంది.కొలెస్ట్రాల్ తగ్గుతుందినానబెట్టిన బాదంపప్పుల వలన కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం తగ్గుతుంది. వీటిల్లో మోనోసాచ్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి అవి శరీరంలోని చెడ్డ కొవ్వులను కరిగిస్తాయి.

Image result for badam pappu

బాదంలలో ఉండే విటమిన్ ఇ రక్తప్రవాహంలోని మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.గుండెకి మంచిదినానబెట్టిన బాదంపప్పులలో ప్రొటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, తీవ్ర ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడటంలో సాయపడతాయి.రక్తపోటును మెరుగుపరుస్తాయిమీకు తెలుసా నానబెట్టిన బాదంపప్పు అధిక రక్తపోటును నయం చేస్తాయని? నానబెట్టిన బాదంపప్పుల్లో ఉండే అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం రక్తపోటు పెరగకుండా చూస్తాయి. వాటిల్లో ఫోలిక్ యాసిడ్ మరియు మెగ్నీషియం ఉండి రక్తనాళాలు నిండిపోకుండా ఆ రిస్క్ ను తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: