కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తుంచుకోలేరు.సాధారణ సమయంలో గుర్తుంచుకుంటారేమో గానే పరీక్ష సమయంలో మాత్రం మర్చిపోతుంటారు. కొంతమందిలో చదవాలనే ఆసక్తి కూడా కనబడదు.పిల్లలు మంచిగా చదవాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని సలహాలను పాటిస్తే మీ పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరిగి బాగా చదువుతారు.

పిల్లలకు మంచి పోషకాలు కల ఆహారంతో పాటు విటమిన్ బి 12 విటమిన్ సి ఇ క్యాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహార పదార్థాలను రోజు వారి డైయట్ లో ఇవ్వాలి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే దానిమ్మ రసం పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది.అలాగే నేరెడుపండులో కూడా జ్ఞాపక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

రోజు ఒక గ్లాస్ ద్రాక్ష రసం త్రాగడం మంచిది అలాగే తేనె తీసుకోవడం వలన కూడా పిల్లల్లో జ్ఞాపక శక్తిి పెంచుతుంది.అలాగే జలుబు చేస్తుందని పిల్లలకి కొబ్బరి నీరు తాగించరు.కాని మెదడు చురుగ్గా పని చేయడానికి సూపర్ బ్రెయిన్ ఫుడ్స్ లలో కొబ్బరి నీళ్లు ఒకటి.ఇవి జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచుతాయి.అలాగే పాలకూర కూడా జ్ఞాపక శక్తికి పెంచుతుంది.

అలాగే బీట్రూట్ లో కూడా మెదడు చురుగ్గా పని చేయడానికి సహకరించే గుణాలు ఉన్నాయి.కలబంద రసంలో విటమిన్ బి 6 ఉండడం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తికి దోహదపడుతుంది. టమాటో లోని యాంటీ ఆక్సిడెంట్ లు లైకోపిన్ లు జ్ఞాపక శక్తికి తోడ్పడుతాయి ఎక్కువ ఫ్యాట్ కలిగిన పదార్థాలను తీసుకోకడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: