వేసవి కాలం వచ్చింది అంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని వెంటాడుతూనే ఉంటాయి మనిషి ఎంతగా ఏసీ రూముల్లో కూర్చున్నా సరే వేసవి ప్రాభవం నుంచీ  తప్పించుకోవడం అసాధ్యం అని చెప్పాలి..ఎంతో మంది వేసవిలో అలసటతో, డీ హైడ్రేషన్ తో , చర్మ సంభందిత వ్యాధులు మరియు గ్యాస్ ట్రబుల్ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు.అయితే వేసవి కాలంలో సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా వేసవి తాపాన్ని సూర్య శక్తి నుంచీ కాపాడుకునే పద్దతులని ప్రకృతి మనకి ఇచ్చింది వాటిలో ముఖ్యమైనవి  తాటి ముంజులు.

 Image result for తాటి ముంజులు

తాటి ముంజులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు...ఇవి తినడానికి రుచిగా ఉంటాయి..పల్లెల్లో తాటి కల్లు కూడా తాగుతారు అయితే చిన్న పెద్దా తేడా లేకుండా అందరు తినేది తాటి ముంజులు మాత్రమే  తెల్లగా మెరుస్తూ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. అందుకే వీటిని ఐస్‌యాపిల్స్‌ అని పిలుస్తారు. తాటి ముంజుల్లో విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం, సి.ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్‌, పొటాషియం, ధయామిన్‌, రిబో ప్లేవిస్‌, నియాసిస్‌ వంటి బీ కాంప్లెక్స్‌ తదితర పోషకాలు లభిస్తాయి.

 Image result for తాటి ముంజులు

అయితే సుమారు వంద గ్రాముల తాటిముంజుల్లో 43 గ్రాముల కేలరీలు  ఉంటాయట...తాటి ముంజులు తినేటప్పుడుపై పొట్టు తీసేస్తారు. కానీ ఆ పొట్టులోనే అనేక రకాల పోషకాలు నిక్షిప్తమై ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు. మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను తగ్గించే జీవక్రియను బాగుపరుస్తుందని వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చిన్న పిల్లలకు, వృద్ధులకు తాటిముంజులు ఔషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

 Image result for తాటి ముంజులు

అంతేకాదు ముంజులూ వేసవిలో వచ్చే దాహార్తిని తగ్గిస్తాయి..కాలిన గాయాలకు, మచ్చ లు, దద్దుర్లు వంటి సమస్యలు వంటి సమస్యలు పోగొడతాయి..ముఖ్యంగా వేసవిలో అందరు ఎదుర్కునే సమస్య శరీరం అంతా పేలి పోవడం చెమట కాయలు రావడం..అయితే ఒక్క సారి గనుకా తాటి ముంజులతో ఆ గుజ్జుని శరీరం అంతా పట్టిస్తే కేవలం రెండు రోజుల్లో మాయం అయిపోతాయి..అంతేకాదు వడదెబ్బ తగిలినప్పుడు ముంజులని జ్యూస్ గా చేసి పట్టిస్తే త్వరగా ఉపసమనం కలుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: