ఐబీపీఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) దేశవ్యాప్తంగా వివిధ రీజనల్ రూరల్ బ్యాంకులలో ఖాళీగా ఉన్నదాదాపు 8400 ఆఫీసర్, మల్టీపర్పస్, మొదలగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలని పరిశీలిస్తే..

 Jobs

విభాగాల వారీ ఖాళీలు:

              విభాగం

  ఖాళీలు

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)

  3688

ఆఫీసర్ స్కేల్-1

  3381

ఆఫీసర్ స్కేల్-2 (అగ్రికల్చర్ ఆఫీసర్)

    106

ఆఫీసర్ స్కేల్-2 (మార్కెటింగ్ ఆఫీసర్)

     45

ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ ఆఫీసర్)

     11

ఆఫీసర్ స్కేల్-2 (లా)

    19

ఆఫీసర్ స్కేల్-2 (సీఏ)

    24

ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ)

   76

ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్)

  893

ఆఫీసర్ స్కేల్-3

  157

మొత్తం

  8400

 

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఖాళీలు : 829

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పోస్టులను బట్టి పని అనుభవం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.

వయసు: ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య; ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 21-32 ఏళ్ల మధ్య; ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 21-40 ఏళ్ల మధ్య; ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100; మిగిలిన వారికి రూ.600.

పరీక్ష తేదీలు..


రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూలై 4, 2019.
ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2019, ఆగస్టు 3, 4, 11 తేదీల్లో ఉంటుంది.
ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షతేదీ: 2019, ఆగస్టు 17, 18, 25 తేదీల్లో ఉంటుంది.
ఆఫీసర్స్ స్కేల్-1, 2, 3 మెయిన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 22, 2019.
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ తేదీ: సెప్టెంబర్ 29, 2019.

పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ఆంధ్రప్రదేశ్: అనంతపురం, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   www.ibps.in


మరింత సమాచారం తెలుసుకోండి: