బరువు తగ్గించుకోవడానికి రోజు జీమ్‌కు వెళ్ళి అష్టకష్టాలు పడుతున్నారా? శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే కష్టపడుతున్నారా?. అయితే అంతలా కష్టపడుకుండా ఓ గంట సేపు రోజు సైకిల్‌ తొక్కితే చాలు చాలా సులువుగా బరువు తగ్గించుకొవచ్చు. స‌హ‌జంగా ఇంట్లో నుంచి కాలు బయటపెడితే బైక్. బండి లేనిదే వీధి చివరకు కూడా వెళ్లనంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల భారినపడుతున్నారు. 


చిన్న చిన్న పనులకు బైక్‌ల మీదే కాకుండా సైకిల్‌ మీదే వెళ్లండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్ తీసికెళ్ళండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్‌ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారంలో ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు కరుగుపోతుంది. రోజూ ఓ గంట సేపు సైకిల్‌ తొక్కడం ద్వారా అదే స్థాయిలో కొవ్వు కరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 


సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తం కదులుతుంది. దీంతో దాదాపు అన్ని భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది.  శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇవే కాదు.. సైకిల్ తొక్క‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.. మధుమేహాన్ని, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.


- కండపుష్టి వృద్ధి చెందుతుంది. అలాగే శబ్ద, వాయు కాలుష్యం ఉండదు.


- ఇంధనం అవసరం లేదు.. పెట్రోల్ ధరలతో బెంగలేదు.. నడక కంటే వేగంగా వెళ్లొచ్చు.


- రహదారి మరణాలను తగ్గిస్తుంది.. ఎముకలు గట్టిపడతాయి.. జంతువులను రక్షిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: