ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక‌మంది కంటి స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా చ‌దువుకునే పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అలాగే పెద్ద‌లు ఆఫీసుల్లో లాప్‌టాప్ల ముందు కూర్చ‌ని ఇంట్లో ఫోన్ల‌ ముందు ఇలా ఆ ఎఫెక్టూవ్ రేడియేష‌న్ వ‌ల్ల వారికి కూడా కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గానే ఉంటాయి.  


దీనికి కార‌ణం స‌రైన పోష‌ణ అంద‌క‌పోవ‌డం లేదా కంటిపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌క‌పోవ‌డం.. కంటి చూపు స‌మ‌స్య‌కు మందులు వాడి న‌యం చేసుకోవాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ప్ర‌యోజ‌నం ఉండ‌దు. స‌హ‌జ‌సిద్ధంగా ప్ర‌కృతిలో ల‌భించే ప‌దార్థాల‌తో మ‌నం ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. దుష్ప్ర‌భావాలు కూడా ఏమీ ఉండ‌వు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- క‌రివేపాకు కంటిచూపుకు బాగా స‌హ‌క‌రిస్తుంది. దీనిలో ఉండే విట‌మిన్ ఎ కంటిచూపును మెరుగుప‌రుస్తుంది. ప్రతిరోజు రెండు క‌రివేపాకు రెబ్బ‌ల్ని తిన‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అంతేకాదు మాన‌సిక ఒత్తిడి కూడా త‌గ్గుతుంది.


- క‌ళ్ల‌కు మేలు చేయ‌డంల పాన్న‌గంటికూర‌కు మంచింది లేదు. త‌ర‌చూ ఈ కూర తిన‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌ల్ని దూరం చేసుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు కంటి స‌మ‌స్య‌లు ఉంటే రోజూ ఓ క‌ప్పు పాన్న‌గంటి ఆకు ర‌సం తాగించాలి.


- ప్ర‌తిరోజూ గ్రీన్ లీఫ్ వేజిట‌బుల్స్‌, ఎండు చేప‌లు, ఫ‌లాలు, గుడ్లు, క్యారెట్‌, టొమాటో వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటూ కంటిచూపు మెరుగుప‌డుతుంది.


- రెండు ప‌లుకులు ప‌చ్చ కర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ లేదా వెన్న‌ను కానీ లేదా వెన్న‌ను కానీ క‌లిపి త‌మ‌ల‌పాకులో వేసుకుని న‌మిలి ర‌సాన్ని మింగితే కంటికి సంబంధించిన స‌మ‌స్య‌లు దూర‌ప‌మ‌వుతాయి. అంతేకాకుంబా శ‌రీరంలోని వేడి కూడా త‌గ్గుతుంది.


- కొబ్బ‌రి నూనెలో దూదిని ముంచి ఆ దూదిని క‌నురెప్ప‌ల‌పై 20 నిమిషాల పాటు ఉంచితే క‌ళ్ల‌కు విశ్రాంతి క‌లిగి మంచి ఫ‌లితం ఉంటుంది.


- ప‌చ్చ కర్పూరం తీసుకోవ‌డం వ‌ల్ల క‌ళ్లు మంట‌లు, క‌ళ్లు ఎరుపెక్క‌డం, క‌ళ్లో నుంచి నీరు కార‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కంటిచూపు మెరుగుప‌డుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: