రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .పడుకునే విధానం ఇలా ఉండాలి.. ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి . దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .


మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది . మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .


ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఈ ప్రయోజనాలు ఉన్నాయి..

1 . గురక తగ్గి పోవును .

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .

4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .

5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .

15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .


ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును . ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .


మరింత సమాచారం తెలుసుకోండి: