రోజు కార్యాలయ పని ఒత్తిళ్ళు,చిన్న పిల్లల బాగోగులు చూసుకోవడం,లేదా సాధారణ బిజీ షెడ్యూల్స్ మొదలైన అనేక కారణాలు విశ్రాంతి లేమికి దారితీస్తుంటాయి.అనేక సార్లు, మీరు మంచి చర్మం,జుట్టు కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం మూలంగా అవి సమస్యలలో కూరుకోవడం ప్రారంభిస్తుంటాయి.దీనికి కారణం సమయం లేకపోవడం, అధిక ఒత్తిడి,కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు గడపాల్సి రావడం,దుమ్ము,ధూళి,ఇతర కాలుష్యాల ప్రభావాలు,మొదలైనవి మీ చర్మం,పైన జుట్టు మీద తీవ్రమైన ప్రభావా న్ని చూపిస్తాయి..సాధారణంగా,గమనిస్తే అనేకమంది పొద్దున స్నానం చేసేటప్పుడు మాత్రమే చర్మాన్ని,జుట్టుని క్లీన్ చేసుకుంటారు.



ఒకవేళ వాటిపట్ల ప్రత్యేక శ్రద్ద కనపరచాలని భావిస్తే వారాంతరాలనే ఎన్నుకుంటూ ఉంటారు.అప్పుడే కదా ఉద్యోగులకు సెలవు దొరికేది.ఏదిఏమైనా,ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని  జుట్టును సాధించడం కొరకు రోజువారీ అలవాట్లలో కొన్ని చిట్కాలను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పాటించడం ద్వారా కనీసం కొంతమేర సమస్యలకు దూరంగా ఉండగలరు..అవేంటో చూద్దాం..



1.ఖచ్చితంగా ముఖాన్ని కడుక్కోవాలి : మీరు కేవలం కొన్ని గంటల క్రితం ముఖాన్ని కడుక్కుని ఉన్నా కూడా,నిద్రపోయే ముందు ఖచ్చితంగా కడుక్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.రాత్రి సమయాలలో మీ చర్మ రంద్రాలలో సెబం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమల అభివృద్ధికి దారితీస్తుంది.
2.మీ మేకప్ తొలగించండి : మీ మేకప్ తొలగించడం ఎంతో ముఖ్యమైనది.మేకప్ అలాగే ఉంచి నిద్రపోవడం సరికాదు.మేకప్ అలాగే ఉంచడం మూలంగా,కెమికల్స్ మరియు గ్రీజుతో మీ రంద్రాలు మూసుకుంటాయి.దీని వలన తరచుగా మొటిమలు మరియు మచ్చలు ఏర్పడుతాయి.కావున ఖచ్చితంగా మేకప్ తొలగించాలని నిర్ధారించుకోండి.దీనికి మీరు నువ్వుల నూనెను కూడా కాటన్ పాడ్ తో ఉపయోగించవచ్చు.
3.మీ చర్మానికి ఎక్స్ఫోలియేట్ చేయండి : మీ చర్మంపై పేరుకుని పోయిన మురికి, గ్రీజ్ మరియు మృత కణాలను పూర్తిస్థాయిలో తొలగించిన తర్వాతనే నిద్రకు ఉపక్రమించడం మేలు.ఇవి పేరుకునిపోవడం వలన చర్మం పొడిబారడం,వృద్దాప్య చాయలు ఏర్పడడం,డార్క్ సర్కిల్స్,మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ఖచ్చితంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు,ఏదైనా ఒక తేలికపాటి స్క్రబ్ వినియోగించి మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి.
4.కంటి కింద సూచించిన క్రీమ్ అప్లై చేయడం ఎంతో ముఖ్యం : మంచి అండర్-ఐ క్రీమ్ వైద్యుని సహాయంతో ఎంచుకోండి.దీనిని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నిమిషాలపాటు మీ కళ్ళ చుట్టుపక్కల భాగంలో మసాజ్ చేయండి.ఇది డార్క్ సర్కిల్స్ మరియు వృద్దాప్య చారలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.




5.మీ చేతులను, పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి : మీ చేతులు మరియు పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు మీ చేతులు మరియు పాదాల మీద విటమిన్ ఎ లేదా విటమిన్ సి తో కూడిన ఒక స్కిన్ క్రీమ్ ఉపయోగించండి.
6.మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం : ముఖానికి తరచుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఇది మీ ముఖం యొక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, ముడతలు మరియు చారల వంటి సంకేతాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
7.కాటన్ దిండు కవర్లు వాడడం మానండి : మీరు ఒక కాటన్ బదులుగా ఒక సిల్క్ జోడించిన దిండు కవర్ ఉపయోగించవచ్చు. కాటన్ దిండు కవర్లు మీ చర్మం మరియు జుట్టును పొడిబారేలా,నిస్తేజంగా మార్చగలవు. 
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కొంతలో కొంతైన చర్మాన్ని కాపాడుకునే అవకాశం వుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: