ఇటీవల కాలంలో స్త్రీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రధాన సమస్య `బ్రెస్ట్‌ క్యాన్సర్`. బ్రెస్ట్ క్యాన్సర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంత మంది మహిళల్లో మాత్రమే వస్తుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం తినే ఆహారంపై శ్రద్ధ  తీసుకోకపోవడమే. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో.. అందుకే మహిళలంతా ఖ‌చ్చితంగా బ్రెస్ట్‌ క్యాన్సర్ పై అవగాహన ఉండాలి.


అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మనదేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 25.8 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే. ఇందులో  12.7 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే యుక్త వ‌య‌స్సు నుంచే అమ్మాయిలు అధిక పీచు ఉన్న ఆహారాన్ని... అదీ పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకుంటే తరవాతి కాలంలో బ్రెస్ట్‌ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని అమెరికా లోని హార్వార్డ్ టి.హెచ్.చాన్ ఆప్ పబ్లిక్ హెల్త్‌ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.


ఎందుకంటే కౌమార దశలోనే బ్రెస్ట్ కణజాలములోని కణాలు క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ రహిత కణాలుగా అభివృద్ధి చెందుతాయట. అందుకే వీళ్ళు చిన్న వయస్సు నుండి ముఖ్యంగా 14-18 ఏళ్ళ మధ్యలో ఆహారంలో భాగంగా రోజుకి 25. గ్రాముల పీచును తీసుకున్న వాళ్ళను పరిశీలించగా వాళ్ళకు భవిష్యత్తులో బ్రెస్ట్‌ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధకులు వెల్ల‌డించారు. అందుకని యుక్త  వయస్సు నుండి ఆడవాళ్ళు పీచు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవ‌డం చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: