చినుకు రాల‌గానే ప్రతి చెట్టు చిగురిస్తుంది. ఈ చిగుళ్లు చూడడానికి అందంగా.. మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి. అయితే తొలకరి జల్లు పడగానే చిగురించే చింత చెట్టు చిగుళ్లు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎంతో రుచిగా ఉండే చింత చిగురును పూర్వకాలం నుండి ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎన్నో రకాల పోషకాలు అందడమే కాదు.. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చింత చిగురులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అంత ప్రాముఖ్యత ఉన్న చింత చిగురు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


చింత చిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా వుంటాయి. చింత చిగురు శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింత పండు రసం పుల్లని రుచినిస్తుంది. చింత చిగురు వ‌ల్ల  రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. అలాగే దీన్ని కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు.


చింత చిగురు మన శరీరంలోని వాతాన్ని, పైత్యాన్ని పూర్తిగా హరిస్తుంది. ప్రతి రోజూ చింత చిగురు రసం అరకప్పు ఉదయం వేడి నీళ్ళతో కలిపి త్రాగడంవల్ల పచ్చ కామెర్ల వ్యాధి నాలుగు రోజుల్లో నివారణ అవుతుంది. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడంగా ఉంటాయి. చింత చిగురు గుండె జ‌బ్బుల నుండి ర‌క్షిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: