ప్ర‌స్తుతం డెంగీ వ్యాధి అంద‌రినీ ఇబ్బంది పెడుతోంది.  ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. మ‌రియు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. చిన్న దోమ కారణంగా డెంగీ వంటి వ్యాధుల భారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులున్నాయి. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య సమస్యలు లోపించడం వల్ల వాటిలో దోమలు స్థావరాలను ఏర్పరచుకుంటాయి ఈ డెంగీ దోమ‌ల నివార‌ణ‌కు ఎంత‌ ప్ర‌య‌త్నించినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అయితే నిమ్మ‌తో డెంగీ దోమ‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి దీని కోసం ఏం ? చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


నిమ్మకాయ అద్భుతమైన మేలు చేస్తుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ముందు ఒక నిమ్మ‌కాయ తీసుకొని సగానికి కోసి అందులో కొన్ని లవంగాలని గుచ్చి రూమ్‌లో పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే డెంగీ దోమలు, బ్యాక్తీరియా నివార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే  ఒక్క నిమ్మ బద్దని గనక మన దిండు పక్కన పెట్టుకుంటే.. రూమంతా నిమ్మలోని సిట్రస్ వ్యాపించి మనసుని ఉల్లాసపరుస్తుందట.


రోజంతా పని చేసి వచ్చిన కష్టాన్నీ, అలసటనీ, స్ట్రెస్ నీ టెన్షన్ తగ్గించి మనసునీ, తద్వారా శరీరాన్నీ తేలిక పరుస్తుంది. రిలాక్సింగ్ టానిక్ లా పని చేస్తుంది. నిమ్మ ఆయిల్ ని రూమ్ ఫ్రెష్ నర్ లా వాడిన‌ మంచి ఫలితం ఉంటుందట. బీపీ ఉన్నవారికి, ముఖ్యంగా లో బీపీ ఉన్నవాళ్లు, ఈ నిమ్మ వాసన పీల్చడం వల్ల బీపీ సాధారణ స్థితికి వస్తుంది. హైపర్ టెన్షన్ ని కూడా దూరం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: