వంట సోడాని మనం కేకులు,బజ్జీలు మొదలగు పదార్ధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాము.కానీ దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.ఇక ప్రకృతిసిద్ధంగా దొరికె బేకింగ్ సోడాను నాకొలైట్ అంటారు.ఇక ఈ వంట సోడాను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మీకు తెలుసా.వంటలలో,ఇంటిలో,వైద్యంలో ఇలా పలురకాలుగా ఉపయోగించవచ్చూ. మామూలుగా ఎవరి ఇంట్లోనైనా దుర్వాసన వస్తుంటే దాన్ని పోగొట్టేందుకు ఎయిర్‌ స్ప్రే వాడతాం.వీటి బదులు సహజ పద్ధతిలో బేకింగ్‌ సోడాతో రూమ్‌ ఫ్రెష్‌నర్‌ తయారు చేసుకుంటే సరి..ఎలాగంటే రెండు కప్పుల నీటిలో టేబుల్‌ స్పూను బేకింగ్‌ సోడా వేయాలి. దీనిలో 15 చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్ వేసి,ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిళ్లలో నింపి వాడొచ్చూ...



అంతేకాకుండా,ఫర్నిచర్ మీద పెన్సిల్ గీతలు,క్రేయాన్ మరకలు,సిరా మరకలు మొదలైన మరకలుంటే వాటిమీద కొంచెం బేకింగ్ సోడా చల్లి స్పాంజ్ తో ఆ మరకల మీద రుద్దండి.మరకలు మాయం..ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి.తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది.ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది.కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టు ప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది..కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు,బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది...




కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి.మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి.తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన,రుచికరమైన మాంసం తయార్. టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి.టేస్టీ సూప్ రెడీ...




ఇక పొట్టలో మంట లేక అస్వస్థతగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది.కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి.తరుచుగా వాడకూడదు.చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం.పళ్లు పసుపు పచ్చ రంగులో మారినప్పుడు కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి,అందులో నాలుగు టేబుల్‌ స్పూన్ల బేకింగ్‌ సోడా వేసి కలిపి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమంతో తోముకుంటే దంతాల మీది మరకలు పోయి,తళతళ మెరుస్తాయి. ఇదండీ బేకింగ్ సోడా ఉపయోగాలు...

మరింత సమాచారం తెలుసుకోండి: