తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వైద్యులతో ముఖాముఖి అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి డాక్టర్స్ నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. వైద్య చరిత్రలోనే ఏ వైద్య మంత్రి కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదంటూ ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో  పూర్తి స్థాయిలో పని చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవ చేస్తామని తెలంగాణలోని వైద్యులు భరోసా ఇస్తున్నారు. దీని స్పందించిన వైద్య మంత్రి ఈటెల డాక్టర్స్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.  ఆరోగ్య తెలంగాణకు అందరి సహకారాన్ని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిపై భరోసాతో రావాలని ప్రజలు పిలుపు నిచ్చారు. కుటుంబం ఆస్తి అనే దగ్గర నుండి కుటుంబం భారం అనే  దగ్గరికి  సమాజం వచ్చిందన్నారు. ఆరోగ్యవంతమైన యువతే దేశ సంపద అని మంత్రి చెప్పారు. 



అనేక పథకాలు తీసుకువచ్చిన  కేరళ తమిళనాడు తర్వాత తెలంగాణ నిలిచిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా అరోగ్య శాఖ అధికారులు సిబ్బంది నిర్విరామంగా పని చేయడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది.  ఇన్ని చేసినా కొన్ని చిన్న చిన్న సంఘటనలు కళంకం తెస్తున్నాయని అన్నారు. ఇవి కూడా రాకుండా జాగ్రత్త పడదామని పులుపు నిచ్చారు. రోగాలు ఉన్నవారు పేదవారు అన్న తేడా లేకుండా అందరికీ వస్తున్నాయని చెప్పారు. గుడిసెలో ఉన్నవారికి మనమే దిక్కు.. అలా వచ్చినవారికి ప్రాణదానం చేస్తున్న వారు ప్రభుత్వ డాక్టర్స్ మాత్రమేనన్నారు.  తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత 5 సంవత్సరాల కాలంలో 4  మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో  ఎయిమ్స్, ఈఎస్ ఐ ,   మెడికల్  కాలేజీలు కలిపితే మొత్తం 6 కాలేజీలు అయ్యాయన్నారు. ఇవ్వన్నీ పూర్తి స్థాయిలో మొదలయితే గాంధీ ఉస్మానియా మీద భారం తగ్గుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.




ప్రభుత్వ ఆసుపత్రుల  ద్వారానే అందరికీ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధంగా పని చేస్తున్న 9 ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో  డిపార్టుమెంటుల వారీగా డాక్టర్స్ నుండి మంత్రి అభిప్రాయాలను సేకరించారు. సఫాయి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి కొదవ లేకుండా చూస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.పీజీ  డాక్టర్స్ అటెండెన్స్ ను  ప్రతి నెలా 25 వ తేదీలోగా పంపించాలని ఆయా విభాగాధిపతిలకు ఈటెల  ఆదేశాలను జారీ చేశారు. రోగుల రద్దీకి అనుగుణంగా డాక్టర్స్, నర్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి ఈటెల తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: