సాధార‌ణంగా ట‌మాటాతో చేసే వంట‌కాల‌ను ఇష్ట‌ప‌డ‌నివారుండ‌రు. ట‌మాటాకు ఉండే రుచే వేరు. దీన్ని ఏ కూర‌గాయ‌తో జ‌త చేసి వండినా చాలా రుచిగా ఉంటుంది. అయితే ట‌మాటాతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా మెండు. టమోటాల్లో లైకోపేన్‌ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వ‌ల్ల  కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి. మ‌రియు పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది.


అలాగే ట‌మాటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.


నిరంతరం టమోటాలను తీసుకోవడం వల్ల‌ ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. టమోటాలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగనిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది.


వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది. మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: