సాధార‌ణంగా సంగీతం వింటుంటే మనసు తేలిపోతుంది. కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. ఐక్యూ శక్తి పెరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే సంగీతాన్ని ఆస్వాదించే వాళ్ళే కాకుండా సంగీత వాయిద్యాల‌ను వాయించే వాళ్లకు కూడా ప్రయోజనాలుంటాయి. కేవలం శ్రోతగా మిగిలిపోవడం కన్నా.. రెండు చేతి వేళ్లకు పని ఉండే పియానో, వ‌యోలిన్‌, త‌బ‌లా, మృదంగం వంటి వాయిద్యాల్ని వాయించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.


వేళ్ల‌ను ఉపయోగించి వాయించడం ద్వారా మెదడులో ప్ర‌జ్ఞ‌ను పెంచే గ్రే- మ్యాటర్, మోటార్ కార్టెక్స్ రీజ‌న్ పరిధి పెరిగినట్లు ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. సంగీత శిక్షణ పొందడానికి ముందు, ఆ తర్వాత చేసిన మెదడు స్కానింగ్‌ల రిపోర్టుల ఆధారంగా పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. స్వరప్రస్థానంలో పలురకాల స్వరాలను కలుపుతూ పోయే క్రమంలో మెదడులోని న్యూరో ట్రాన్స్ మీట‌ర్ల‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసే న్యూరో ప్లాస్టిసిటీ పెరుగుతుంది.


అయితే పదే పదే వాయించడం ద్వారా అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్న‌ది పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఏదో హాబీగా కాకుండా సంగీతాన్ని వృత్తిగా లేదా జీవిత లక్ష్యంగా తీసుకునేవారిలో ఈ ప్రయోజనాలు అత్యధికంగా ఉంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. వండర్ బిల్ట్ యూనివర్సిటీలో జరిగిన ఈ పరిశోధనలో సంగీత ప్రవేశం లేని సగటు వ్యక్తి తో పోలిస్తే, సంగీత శిక్షణ పొందిన వారి ఆలోచనా ప్రమాణాల్లో ఎంత ఉన్నతి కనబడుతున్నట్లు పరిశోధకులు గ్రహించారు.


ఈ అధ్య‌యనాల‌న్నీ వారు ఎనిమిదేళ్లకు పైగా వాయిద్య సంగీత శిక్షణ పొందిన వారి మీదే చేశారు. అయితే ఏదో ఒక చేతిని మాత్రమే ఉపయోగించే సాధ‌న క‌న్నా రెండు చేతులతోనూ వాయించే పియోనో లాంటి వాయిద్యాలు వాయించ‌డం ఎక్కువ ఫ‌లితం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: