బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. దీనిలో రెండు రకాలున్నయి. ఒకటి తీగ బచ్చలి మరియు రెండవది కాడ బచ్చలి. ఇతర ఆకుకూరల కన్నా వీటిని ఎక్కువగా నిల్వ ఉంచగల సామర్థ్యం ఉంటుంది. ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3ఫేటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల అరోగ్యానికి మంచిది. బచ్చలికూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఇనుమును సరఫరా చేస్తుంది.


అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ సి లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ - ఎ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి చలువ చేయు గుణాన్ని కలిగి ఉంటుంది. గర్భిణీలు బచ్చలి సూప్‌ను ప్రతిరోజూ తీసుకుంటే గర్భస్రావాన్ని నిరోధించవచ్చు. బచ్చలిలోని ఆక్సాలిక్ ఆసిడ్స్ మిగతా ఆకుకూరల కంటే తక్కువ మోతాదులో ఉండడం వల్ల‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీలకు ఎలాంటి హాని కలగదు.


బచ్చలికూర రసం దీర్ఘకాలిక మలబద్దకాన్ని, మూత్రపిండాల వాపును, అధిక రక్తపోటు వంటిని నిరోధించే మందుగా ఉపకరిస్తుంది. అలాగే బచ్చలికూర క్యాన్స‌ర్ నివారించ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి కాండం మంచి కొవ్వును పెంచుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బ‌చ్చ‌లికూర‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: