సాధార‌ణంగా వెల్లుల్లిని వంట‌ల్లో వాడుతుంటారు. వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే.. దాని వాసన కూడా నచ్చనివాళ్లు మరికొందరుంటారు. అన్ని రకాల వంటకాలలో వెల్లుల్లిని సాధారణంగా వాడతారు. ముఖ్యంగా భారతీయ వంటకాలలో వెల్లుల్లి వాడకం ఎక్కువ. వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతుంది. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది.


వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని, వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని, మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది.


వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లి కాలేయానికి మంచిది. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంద‌. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్లూ బాగా ఉన్నాయి.


వీటిల్లో అమినోయాసిడ్స్‌, ప్రొటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదార్థాల నుంచి రక్షిస్తాయి. అయితే వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన లివర్ పనితీరు దెబ్బతినవచ్చు. అందుకే ప‌రిమితిని మించ‌కుండా వెల్లుల్లిని తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: