గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా బ‌రువు త‌గ్గ‌డానికి గోధుమ పిండితో చేసిన రొట్టెలు తింటుంటారు. అయితే  పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే గోధుమలు తక్షణ శక్తినిస్తాయి. గోధుమల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


గోధుమల్లో యాంథోసయానిన్‌ పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ యాంథోసయానిన్లు బరువు తగ్గించుకోవడానికి, గుండెజబ్బులు అదుపులో ఉంచడానికి, మధుమేహ నివారణకి ఉపకరిస్తాయని పరిశోధనల్లో తేలింది. గోధుమలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి. మనం  రోజు తినే ఆహారం లో  గోధుమ ను మూడు కప్పులు తీసుకుంటే ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన, మరియు వ్యాధి లేని జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.


గోధుమ తీసుకోవడం వలన ఈస్ట్రోజెన్ ఉత్పత్తి యొక్క జీవక్రియ రేటు పెరుగుతుంది. మరియు బ్యాక్టీరియల్ ఎంజైములు తగ్గిస్తాయి, తద్వారా పెద్దప్రేగు కాన్సర్ అవకాశాలు త‌గ్గుతాయి. గోధుమ ఉత్పత్తుల లో   ఫైబర్ ఎక్కువ గా లబిస్తుంది. ఫైబర్ గణనీయంగా రక్తపోటు స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. అదే విధంగా గోధుమ ద్వారా అందించబడిన మెగ్నీషియం మరియు విటమిన్ ఇ కూడా ఆస్త్మా సమస్యను తగ్గించడానికి దోహదం చేస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: