సాధార‌ణంగా నిమ్మ రుచి చూడ‌ని వారుండ‌రు. మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడే వస్తువు నిమ్మకాయ. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే. కూరలపై నిమ్మరసం పిండుకుంటే అదోరకం రుచి.  చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు. ఇలా నిమ్మకాయలను తరచుగా వాడుతూనే ఉంటాం గానీ వీటి ల్లోని ఔషధగుణాల గురించి చాలామందికి తెలియదు. ఎన్నో అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌కు నిమ్మ‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.


ప్రధానమైన యాంటీ ఆక్సిడెంట్లలో విటమిన్‌సి ఒకటి. ఇది నిమ్మలో ఎక్కువగా ఉంటుంది. నిమ్మలో అలర్జీని నివారించే గుణాలు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా నిమ్మ‌లోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. నిమ్మలో విటమిన్‌సి మాత్రమే కాదు. విటమిన్‌ ఏ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటివీ ఉన్నాయి. నిమ్మ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు. అలాగే మలబద్ధకము, అజీర్ణం మొదలగు జీర్ణక్రియ వ్యాధులు నివార‌ణ‌కు నిమ్మ బాగా ప‌ని చేస్తుంది. రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని తాగడం వల్ల‌ పచ్చకామెరల వ్యాధిని దూరం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: