సాధార‌ణంగా ఇంటి గుమ్మానికి పటికను ఉట్టిలో వేలాడదీస్తుంటారు. అయితే పటికను ఆయుర్వేద ఔషదములలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక మ‌నిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాల నుంచి అతి స్వల్ప ఖర్చుతో విలువైన ప్రయోజనం పొందడానికి పటిక ఎంతగానో స‌మాయ‌ప‌డుతుంది. పటిక ఓ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ప‌టిక వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌రి అవేంతో ఇప్పుడు తెలుసుకుందాం..


- పటిక, పొగడచెట్టు బెరడుల్ని పొడుంచేసి పళ్లు తోము కుంటే, కదిలే పళ్లు గట్టిపడతాయి. పళ్లలోంచి చీము, నెత్తురు రావడం తగ్గుతుంది. పంటి నొప్పి కూడా తగ్గుతుంది.


- కొద్దిగా పటిక చూర్ణాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తుంటే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ నీటిని తలకు పట్టిస్తుంటే పేల బాధ తగ్గుతుంది.


- గాయాలను పటిక నీటితో కడిగితే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా, అతి త్వరగా మానతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచీ రక్షణ లభిస్తుంది.


- పటిక కలిపిన నీటిని రెండు మూడు చుక్కలు రోజూ రెండుసార్లు కళ్లలో వేసుకుంటే కళ్ల కలక వ్యాధి త్వరగా తగ్గుతుంది.


- పటిక, జామపండులను నీళ్లలో కలిపి బాగా మరిగించి, ఆ నీళ్లను పుక్కిటిపడితే టాన్సిల్స్‌లో వాపు, నోటిపూత, గొంతులో పుళ్లు, దంతవ్యాధుల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: