‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం‘ అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కళ్ళు చాలా ముఖ్యమైనవి. అందుకే కళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో చురుకుదనం కోసం ఉదయాన్నే ఎక్సర్‌సైజ్‌లు చేస్తాం. అయితే కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం చాలా మంది ఆలోచించరు. అయితే శారీరక ఆరోగ్యానికి వ్యాయామం చేస్తున్నట్లే కళ్ల ఆరోగ్యానికీ కొన్ని ప్రత్యేక వ్యాయామాలు అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం వ్యాయామం కూడా చేయాలి. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- కళ్లను మూసి ఉంచి, చేతివేళ్లతో మసాజ్‌ చేస్తున్నట్లు రెప్పలపై నెమ్మదిగా గుండ్రంగా కదపాలి. కనుగుడ్లను సవ్యదిశలో ఒకసారి, అపసవ్యదిశలో ఒకసారి గుండ్రంగా తిప్పాలి. ఇలా అయిదుసార్లు చేయాలి.


- తలను నిటారుగా వుంచి చూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుంచి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.


- బొటనవేలును తలకు అన్ని వైపులా వివిధ ఇమాజినరీ పాయింట్స్‌ వద్ద ఉంచుతూ కళ్లతో చూస్తుండాలి. ఇలా రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఈ ఎక్సర్‌సైజ్‌ చేస్తే కళ్లకు మంచిది.


- రెండు అరిచేతుల్నీ రుద్దుతూ, వెచ్చగాచేసి, కొంతసేపు కళ్లపైన ఉంచాలి. కళ్లపై ఒత్తిడిపడేలా గట్టిగా నొక్కకుండా అరిచేతుల్ని కళ్లకు ఆనిస్తే చాలు. ఇలా ఆరేడుసార్లు చేయాలి.


- . తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్కనుంచి ఈ పక్కకు తిప్పాలి. అలాగే వీలు చిక్కినప్పుడల్లా చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: