గోధుమ పిండికి రకరకాల రసాయనాలను కలిపి మైదా పిండిని తయారు చేస్తారు. గోధుమ పిండి సాధారణగా లేత పసుపు రంగులో ఉంటుంది. దానికి అజోడికార్బోనమైడ్‌, క్లోరిన్‌ గ్యాస్‌, బెంజైల్‌ పెరాక్సైడ్‌ అనే రసాయనాలను కలిపి తెల్లగా చేస్తారు. మైదాపిండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్న పిండి. రోటీలు, పిజ్జాలు, పరోటా.. ఒకటి కాదు.. ఇలా చాలా రకాల వంటలను మైదాపిండితోనే తయారు చేస్తున్నారు. మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం దుష్ఫ్రభావాలు అన్నీ ఇన్నీ కావు.


సాధార‌ణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి. మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.


అంతేకాదు పిండి రంగును మార్చేందుకు వాడే బెంజాయిల్ పెరాక్సైడ్ కూడా ప్రమాదకరమైన రసాయనం. దీనివాడకాన్ని ఇప్పటికే చైనా, ఐరోపా దేశాలు నిషేధించాయి. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.  కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట పెరుగుతుంది. ఇక మైదాపిండిలో ఎలాంటి పోషకాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: