తేనె అంటే చాల మందికి అమితమైన ఇష్టం. సాధారణంగా తేనె మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఐతే... అది మంచి తేనె అయితేనే ఆ ప్రయోజనాలు మనం పొందగలం.కానీ అది ఒకవేళ  నకిలీ తేనెను వాడితే... ఆరోగ్యానికి మేలు సంగతేమోగానీ... కీడు మాత్రం కచ్చితంగా జరుగుతుంది. కనుక ఇపుడు మంచి తేనె అంటే ఎలా ఉండాలో తెలుసుకుందామా మరి...


గతంలో  తేనె అంటే... పల్లెలు, తండాల నుంచీ తెచ్చి అమ్మేవారు.కానీ ఇప్పుడు... తేనె బ్రాండ్లు వందల్లో ఉన్నాయి ప్రస్తుతం. చాలా పేరున్న కంపెనీలన్నీ తేనెను ప్యాక్ చేస్తున్నాయి. తమదే మంచి తేనె అని చెప్పుకుంటున్నాయి కూడా. కొన్ని కంపెనీలు... ఒక బాటిల్ కొంటే మరో బాటిల్ ఫ్రీ అని కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. మరికొన్ని 50 శాతం ఎక్స్‌ట్రా అని ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. నిజానికి ఆయా కంపెనీలు అమ్ముతున్న తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవే అని అర్థం చేసుకోవాలి. ఇలా అధికంగా ప్రాసెస్ చేస్తే ఆ తేనె వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.


వాస్తవానికి.... స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు చెడిపోదు. కానీ... కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిళ్లపై... ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎందుకంటే... అది నిజమైన తేనె కాదు కాబట్టి. అది ప్రాసెస్ చేసిన తేనె కావడం వల్ల దాన్లో సహజ లక్షణాల్ని అన్ని కూడా పోతాయి.


ఇక షాపుల్లో అమ్ముతున్న తేనె బాటిళ్లలో తేనెతోపాటూ... కార్న్ సిరప్ (corn syrup), పిండి, స్టార్చ్, డెక్ట్రోజ్, ప్రిజర్వేటివ్స్ (పాడవకుండా చేసే పదార్థాల్ని) అని పదార్థాల్ని  కలుపుతారు. ఈ వివరాలు తేనె బాటిల్ పై కూడా రాసి ఉంటాయి. తేనె బాటిల్ కొనుక్కునేవారు వాటిని చదివి... అవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని గ్రహించాలి.
నిజానికి స్వచ్చమైన తేనె నల్లగా ఉంటుంది. ఏమాత్రం ఆకర్షణీయంగా అసలు ఉండదు. దాన్ని సీసాలోపోసి... చూస్తే... అవతల ఉన్న వస్తువులేవీ కనిపించవు. అదే మీరు షాపుల్లో కొనే తేనె బాటిల్‌లో చూస్తే... కొన్నిసార్లు అవతల ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి


మరింత సమాచారం తెలుసుకోండి: