ఈ కాలంలో అందరూ ప్రశాంతంగా కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా తీవ్రంగా నడుమునొప్పి తెచ్చుకుంటున్నారు . ఒకేచోట కదలకుండా 8 నుంచి 9 గంటల పాటు కూర్చోవడం వల్ల తీవ్రంగా నడుము నొప్పి తెచ్చుకుంటున్నారు. ఒకే చోటా ఒకే విధంగా కూర్చోవడం కారణంగా ఈ నడుము నొప్పి మరి ఎక్కువ అయిపోతుంది. 


ఇంకా విషయానికి వస్తే ఈ నడుము నొప్పిని వైద్య భాషలో 'కాక్సీడినియా' అని అంటారు. ఈ నొప్పి ఎక్కువగా బరువు ఎక్కువ ఉన్నవారికి వస్తుంది. ఈ నొప్పి కారణంగా ఎంతో మంది అనారోగ్యపాలు అవుతుంటారు. అయితే ఈ నొప్పికి మూలా కారణాలు మితిమీరిన శరీర బరువు, ఎక్కువ దూరము బైక్ నడపటం, కొన్ని రకాల మందుల వినియోగం, ఎక్కువకాలము మలబద్దకం బారినపడటం, కాక్సిక్స్ ఎముక గాయపడి దాని చుట్టూ ఉండే నరాల పనితీరు దెబ్బతినటం వల్ల నడుము నొప్పి వస్తుంది. 


అయితే ఈ నడుము నొప్పికి నివారణ ఎప్పుడూ ఒకే భంగిమలో కూర్చోకుండా లేచి అప్పుడప్పుడు తిరగటం, వెనక్కి వాలి కూర్చోవటం వంటివి చేయాలి, సుఖవిరోచనం కావటానికి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, కూర్చునే కుర్చీ మెత్తగా ఉండేలా చూసుకోవాలి, వెన్ను దిగువన మెత్తని దిండు ఆనుడుగా పెట్టుకోవాలి,  నెమ్మదిగా డ్రైవింగ్ చేయటం, గతుకుల రోడ్లకు బదులు దూరమైనా మంచి రోడ్డును ఎంచుకోవడం మంచిది. నొప్పి అనిపించినప్పుడు వేడి నీళ్ళ కాపడం పెట్టటం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. కాగా ఈ సమస్య అనిపించినా తొలినాళ్లలోనే వైద్యుని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. చూశారుగా ఒకే చోటా ఒకేలా కూర్చోకుండా అప్పుడప్పుడు తిరుగుతూ ఉండండి. ఇలా చెయ్యడం ఆరోగ్యానికి మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: