ఎవరైనా ఉదయం లేవగానే రామా కృష్ణ అంటారు.. ఈ మధ్య కాలంలో ఉదయం లేవగానే సెల్ఫీలే.. ఉదయం లేవగానే ఇప్పుడు ఎక్కువ మంది చేసే పని సెల్ఫీ తీసుకోవడం…చేసిన ప్రతి చిన్న పనికి క్లిక్ అనిపించడం ఇప్పటి రోజుల్లో కామన్ అయింది. అయితే ఇలా సెల్ఫీలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.ఫోన్ ద్వారా రేడియేషన్ అనేది ముఖం మీద పడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయట. 


మితిమీరిన ఫోన్ వాడకం మానసికస్థితిపైనా ప్రభావం చూపుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం మందగించడానికి, ఆందోళన పెరగడానికి సెల్ఫీలు కారణమవుతున్నాయని ఈస్థటిక్‌ క్లీనిక్స్‌ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడించింది.అంతేకాదండోయి రోజులో మూడు సెల్ఫీలు తీసుకుంటున్నారా అయితే ప్రమాదానికి దగ్గరగా ఉన్నట్లేనని అమెరికన్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌ (ఏపీఏ) అంటోంది.ఇలా వచ్చే ఆరోగ్య సమస్యన సెల్ఫీటస్ గా పేరు పెట్టేసింది.


ఈ సెల్ఫీల వల్ల యాంగ్జైటీ డిజార్డర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈస్థటిక్‌ క్లీనిక్స్‌ డైరెక్టర్లలో ఒకరైన డాక్టర్‌ దేబరాజ్‌షోమే. ఫోటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మేము ఫోటోలో సరిగ్గా పడలేదు మొహాన్ని మార్చుకోవాలి అనే దృక్పదంతో ఉండిపోవడం వల్ల సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయని డాక్టర్‌ దేబరాజ్‌షోమే వెల్లడించారు.ఫ్రంట్ ఫేస్ కెమెరాలను కూడా బ్యాన్ చేసి,ఫ్రంట్ కెమెరా లేని స్మార్ట్ ఫోన్లు సమాజాల్లోకి వస్తే ఇంకా బాగుంటుందేమో అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే ..  పాటించాల్సిన మార్గాలు..
1 . ఎక్కువ సమయం దగ్గర వాళ్లతో గడపడం,
2 .ఒకరు ఏమనుకున్నారో కాకుండా మీగురించి ,మీరు ఆత్మ విశ్వాసం పెంచుకోవడం,
3 . సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేసే సమయాన్ని జీవితాన్ని సరిదిద్దుకొనే పనులపై ద్రుష్టి పెట్టడం
ఇలా చేయడం వల్ల సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన మారుతుందని,వాటివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి మనుషుల మధ్య బంధాలు బలపడతాయని,ఇలా చేయడం వల్ల టైంకి తినడం ,పడుకోవడం చేస్తారు కనుక అనేక రోగాల నుండి బయటపడవచ్చునని అంటున్నారు.. సో సెల్ఫీ లవర్స్ బె కేర్ ఫుల్.. అందాన్ని పదిమందికి చూపించడం కన్నా ఆరోగ్యం ఇంపార్టెంట్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: