సాధారణంగా పేదరికం కారణంతో పౌష్టికాహారం తీసుకోకపోవడం ఒక బాధ అయితే..,, తినే స్థోమత ఉంది లావైపోతారనే భయంతో కడుపు మాడ్చుకోవడం ఇంకో బాధ.. ఇదే అమెరికాలో 10% మందికి కేవలం ఒకరో లేక ఇద్దరో పౌష్టికాహారంతో ఉండగా మన దేశంలో మాత్రం పేదరికం వలనో., అవగాహన లోపాల వలనో పౌష్టికాహార లోపాలు కాస్త ఎక్కువవుతున్నాయి. శరీరంలో కొన్ని పనులు చక్కగా జరగడానికి కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు అవసరం. కానీ! వీటిని శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు. అందుకు మనం తగినంత ఆహారం తీసుకోవడం తప్పనిసరి.

కానీ నేడు మనం కావాల్సిన పోషకాల్ని బాడీకి అందించట్లేదనే చెప్పాలి. మనం తీసుకునే ఆహారంలోనే సరైన పోషకాలు లేకపోతే శరీరం నష్టపోతుంది, అనారోగ్యం వస్తోంది. దేశాల వారీగా, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, వాతావరణాల వారీగా కూడా తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటున్నాయి. అయితే ఇండియాలో ఏయే పోషకాల లోపాలు ఎక్కువగా ఉంటున్నాయో తెలుసుకుందాం:

శరీరంలో తగినంత ఇనుము లేకపోతే అనీమియా ఖాయం. మన దేశంలో దాదాపు సగం మంది అమ్మాయిల్లో, 53% మహిళలకు ఐరన్ లోపం ఉన్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తేల్చింది. ఐరన్ కోసం ఆకుకూరలు, ఖర్జూరాలు, అలాగే పప్పుధాన్యాలు, గింజలు, నట్స్, మాంసం తింటే... ఐరన్ లోపం తొలగిపోతుంది. 

సూర్య కిరణాల నుంచీ లభించేది విటమిన్ డి. అలాంటి విటమిన్ డి లొపిస్తే ఎముకలు గుల్లబారిపోతాయ్, గుండెకు ప్రమాదం, డయాబెటిస్ వస్తుంది, బరువు పెరుగుతారు, టెన్షన్ ఎక్కువవుతుంది. దీనికోసం చక్కగా ఎండలో కాసేపు ఉండాలి. చేపలు (ముఖ్యంగా సముద్ర చేపలు) బాగా తినాలి. 

థైరాయిండ్ హార్మోన్ చక్కగా పనిచెయ్యాలంటే... దానికి అయోడిన్ సరిపడా అందాలి. థైరాయిడ్ హార్మోన్ శరీర ఎదుగుదలకు తోడ్పడుతుంది. మన దేశంలో 325 జిల్లాల్లో సర్వే చెయ్యగా... 236 జిల్లాల్లో ఎక్కువగా అయోడిన్ లోపం ఉన్నట్లు తేలింది. నాణ్యమైన ఉప్పును వాడటం, వెన్న, ఆవు పాలు, గుడ్లు, సముద్ర చేపలు, గడ్డ పెరుగు తీసుకోవడం ద్వారా ఈ లోపం రాదు.

విటమిన్ ఏ లోపిస్తే పెద్దలు, పిల్లలకు కంటి చూపు సమస్యలు వస్తాయి. బిడ్డ పుట్టిన ఆరు నెలలపాటూ తల్లి పాలు పట్టిస్తే ఈ లోపం రాదు. అలాగే ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలని. 1970లోనే విటమిన్ ఏ నిర్మూలన కార్యక్రమం ఇండియాలో మొదలైంది. ఇప్పటివరకూ 3 కోట్ల మంది పిల్లల్ని ఈ లోపం నుంచీ కాపాడారు కూడా. 

చర్మానికీ, రోగనిరోధక శక్తి పెరగడానికీ విటమిన్ సీ చాలా అవసరం. మన దేశంలో 60 ఏళ్లు దాటిన వారిలో 73 శాతం మందికి విటమిన్ సీ లోపం ఉంది. స్మోకింగ్‌ని తగ్గించి, తాజా పండ్లు, పుల్లటి ఆహారాలు తీసుకుంటే... విటమిన్ సీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: